పలు షాపులలో దొంగతనాలు
ఆదివారం దుండగులు షాపులలోకి చొరబడి దొంగతనాలు చేసిన ఘటన వీణవంక మండలలో చోటుచేసుకుంది. ఎస్ఐ తిరుపతి వివరాల ప్రకారం నర్సింగాపూర్ రోడ్లో వైన్ షాప్, వెంకటరమణ ఎలక్ట్రికల్ ఐరన్ అండ్ హార్డ్ వేర్ దుకాణంలో దాని ముందు షట్టర్లు లేపి లోపలికి ప్రవేశించి సీసీ కెమెరాలు కట్‌చేసి డివి ఆర్‌ను దొంగలించారన్నారు.బ్రాండీ షాప్ యజమాని దాసం రఘుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించడం జరిగిందని ఎస్ఐ తెలిపారు.