హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మధ్య వివాదం పెద్దదిగా మారింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో హుజురాబాద్, జమ్మికుంట పట్టణాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.