స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నేడు వీడ్కోలు సమావేశాన్ని కళాశాల ప్రిన్సిపల్ వి. ఆంజనేయరావు అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు ఇంటర్మీడియట్ విద్యాధికారులు హాజరయ్యారు. అతిథుల ప్రసంగం అనంతరం విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందర్ని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.