జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం మగ్గిడి గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. తరగతి గదులను, వంటశాలను, స్టోర్ రూంను తనిఖీ చేసి మధ్యాహ్న భోజనం పరిశీలించారు. కలెక్టర్ వెంట షెడ్యూల్డ్ కులాల అభివృద్ది అధికారి కె. రాజ్ కుమార్, ఎమ్మార్వో, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.