రామారెడ్డి మండలం గంగమ్మ వాగు వద్ద వంతెన నిర్మాణం లేకపోవడం వలన తాత్కాలిక రోడ్డు వేయడం జరిగింది. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు కొట్టుకపోవడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. తాత్కాలిక రోడ్డుపై టూ వీలర్, త్రీ వీలర్ మాత్రమే వెళ్తున్నాయి. ఆదివారం రాత్రి లారీ రోడ్డు దాటే ప్రయత్నంలో బోల్తా కొట్టి డ్రైవర్ స్వల్పగాయలతో బయట పడ్డాడు. వెంటనే వంతెన పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.