రక్తదానంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తి ప్రాణాలను కాపాడవచ్చని, రక్తదానం మహాదానమని బీజేపీ రాష్ట్ర నాయకులు బాణాల లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధాని మోడి సెప్టెంబర్ 17న జన్మదిన సందర్బంగా రక్తదానం నిర్వహించారు. పలువురు యువకులు రక్తదానం చేశారు. లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన యువతను అభినందించారు. ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.