పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా, ఈ నెల 29న పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు, ఎల్లారెడ్డి ఎస్ఐ. బొజ్జ మహేష్ ఆదివారం తెలిపారు. పట్టణంలోని స్థానిక ముత్యపు రాఘవులు ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేయనున్న రక్తదాన శిబిరంలో, రక్తదానం చేసే వారు ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్లో పేరు నమోదు చేసుకోవాలని ఎస్ఐ బొజ్జ మహేష్ కోరారు.