ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 12 వార్డుల్లోని కుటుంబాలను పక్కగా గుర్తించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు అన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో వార్డు అధికారులు, మున్సిపల్ మెప్మా అర్పిలు, సూపర్ వైజర్ లతో సమావేశం నిర్వహించారు. సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ, కుల సర్వేను పక్కగా నిర్వాహించేందుకు ముందస్తుగా వార్డుల వారీగా కేటాయించిన ఎన్యూమరేటర్లు 3వ తేది వరకు కుటుంబాలను గుర్తించాలన్నారు.