ఎల్లారెడ్డి మున్సిపల్ 2వ వార్డు బీసీ కాలనీలో నెలకొన్న మురుగునీటి సమస్య పైకాలనీ వాసులు, సోమవారం కామారెడ్డి కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ.. తమ కాలనీలో ఎగువ ప్రాంతంలో ఉన్న పలు ఇండ్ల నుంచి వస్తున్న మురుగునీరు ఒకేచోట నిలిచి దుర్గంధం వ్యాపించడంతో సతమతమవుతున్నామన్నారు. నిలువ ఉన్న మురికి నీటి వల్ల బీసీ కాలనీలో దోమల బెడద ఎక్కువై రోగాలు పెరిగాయన్నారు.