ప్రజాశ్రేయస్సు కోసమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు ప్రతి కుటుంబ యజమాని సహకరించాలని ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పద్మశ్రీకాంత్ అన్నారు. సోమవారం మున్సిపల్ పరిధిలోని 10వ వార్డులో 10వ రోజు కొనసాగుతున్న కుటుంబ సర్వేలో భాగంగా ఓ ఇంట్లో ఎన్యూమరేటర్ నమోదు చేస్తున్న కుటుంబ వివరాలను చైర్మన్ పరిశీలించారు. వివరాలు క్లుప్తంగా ఇవ్వాలన్నారు.