తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6నుండి కులగణన చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నామని, రాష్ట్ర చరిత్రలోనే కులగణన సువర్ణ అధ్యాయమని ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ 1931వ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం చేసిన కులగణన చివరిదని, తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చి కులగణన చేపట్టడం హర్షనీయమన్నారు.