ఎల్లారెడ్డి పట్టణంలోని టిజి ఎస్ యుయు ఆర్ ఎస్ బాలుర పాఠశాల, కళాశాలలో గురువారం సమాచార హక్కు చట్టం 2005 పైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఎంఎ సలీం పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు విద్యాహక్కు చట్టం, బాల కార్మిక హక్కు చట్టం, ఇతర చట్టాల గురించి వివరించారు.