నిజాంసాగర్ కేజీబీవీని ఆకస్మిక తనిఖీ చేసిన ప్రత్యేకాధికారి
నిజాంసాగర్ కస్తుర్భా గాంధీ బాలికల విద్యాలయాన్ని మంగళవారం మత్స్య శాఖ జిల్లా అధికారి, ప్రత్యేక అధికారి శ్రీపతి ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యాలయంలో రికార్డులు, చుట్టూ పరిసరాలు, వంటగది, విద్యార్థినులకు అందిస్తున్న భోజనం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశంతో వసతి గృహాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎస్ఓ సరోజనకు, అకౌంటెంట్ ఏ. సుమన్ బాయికి వివరించారు.