విద్యార్థులకు అందించే భోజనంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా మంచి భోజనం అందించాలని అదనపు కామారెడ్డి జిల్లా కలెక్టర్ వి. విక్టర్ అన్నారు. మంగళవారం గాంధారి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆయన సందర్శించారు. మధ్యాహ్నం విద్యార్థినులకు ఏర్పాటు చేసిన భోజనంను ఆయన పరిశీలించారు. వంటలు తయారు చేసే సమయంలో శుభ్రత పాటించాలని, ప్రతీ వంటకంపై మూతలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు.