ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ రైల్వే డివిజన్లో మంగళవారం బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఏకంగా రైలులోని 20 బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు.