పిట్లం మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమంలో రెండు ఫిర్యాదులు వచ్చినట్లు పిట్లం తహసీల్దార్ వేణుగోపాల్ తెలిపారు. గోద్మేగాం సమీపంలో గల క్రషర్ మిషన్ పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీవో కమలాకర్, ఆయా శాఖలకు చెందిన అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.