బాన్సువాడ డివిజన్ పరిధిలోని కోయగుట్ట వద్ద మంగళవారం భారీ వర్షం కురవడంతో రైతన్నల వడ్లు వానకు తడిసి ముద్దయ్యాయి. అకాల వర్షంతో ఆరుగాలం కష్టపడ్డ రైతుల పరిస్థితి దారుణంగా మారింది. కోయగుట్ట వద్ద ఓ రైతు రోడ్డుపై వడ్లు ఆరబోశారు. భారీ వర్షం ధాటికి వడ్లు కొట్టుకుపోతున్న వీడియోను చూడవచ్చు.