నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో జరుగుతున్న సమగ్ర సర్వే డేటా ఎంట్రీని మంగళవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. డేటా ఎంట్రీ త్వరగా తప్పులు లేకుండా నిర్వహించాలని, అదనంగా లాగిన్స్ తీసుకోవాలని సూచించారు. అనంతరం విద్యాలయంలోని గ్రంథాలయాన్ని సందర్శించారు.