జుక్కల్ తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదులు రాలేదని జుక్కల్ తహశీల్దార్ హిమబిందు తెలిపారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ జుక్కల్ మండలంలోని ప్రజలు గ్రామాలలో నివాసముంటున్న వారు ఏవైనా తమ సమస్యలను నేరుగా ప్రతి సోమవారం నిర్వహించబడే ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి ఫిర్యాదులు అందజేయాలని అన్నారు. చిన్న చిన్న సమస్యలు ప్రజావాణిలో సత్వరమే పరిష్కారం అవుతాయన్నారు.