కామారెడ్డి జిల్లా బిచ్కుంద తహశీల్దార్ ఆఫీసులో సోమవారం జరిగిన "ప్రజావాణి"కార్యక్రమంలో ఎలాంటి ఫిర్యాదులు రాలేదని బిచ్కుంద తహశీల్దార్ సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ బిచ్కుంద మండలంలోని ప్రజలు గ్రామాలలో నివాసముంటున్న వారు ఏవైనా తమ సమస్యలను నేరుగా ప్రతి సోమవారం నిర్వహించబడే ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి ఫిర్యాదులు అందజేయాలన్నారు. బిచ్కుంద ఎంపీడీవో అధికారులు పాల్గొన్నారు.