రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం మహారాష్ట్రలోని దెగ్లూర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరుగు ప్రయాణంలో ధర్మారం టోల్ గేట్ వద్ద జుక్కల్ ఎమ్యెల్యే తోట లక్ష్మీకాంతరావు మంత్రికి చెప్పి ఆగేలా చేశారు. జుక్కల్ మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కల్లాలి మాజీ సర్పంచ్ రమేష్ దేశాయ్, జుక్కల్ మండల మాజీ ఉపాధ్యక్షులు ఉమాకాంత్ దేశాయ్, కౌలాస్ మాజీ సర్పంచ్ హనుమాన్లు మంత్రిని కలిసి సత్కరించారు.