జుక్కల్: అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తే చర్యలు

55பார்த்தது
జుక్కల్: అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తే చర్యలు
వ్యాపారులు అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తిరుమల ప్రసాద్ హెచ్చరించారు. మంగళవారం మహమ్మద్ నగర్లో ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. యూరియా నిల్వలు, రిజిస్టర్లను పరిశీలించారు. ఆధార్ కార్డు తీసుకొచ్చిన రైతులకు ఈ-పాస్ మిషన్ల ద్వారానే ఎరువులను విక్రయించాలన్నారు. ఆయన వెంట మండల ఏవో అమర ప్రసాద్, వ్యవసాయ విస్తరణ అధికారి మధుసూదన్ రావు ఉన్నారు.

தொடர்புடைய செய்தி