తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్బంగా పిట్లం మండలం వడ్లం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గ్రామంలో ఉచిత కంటి వైద్య శిభిరం నిర్వహించడం జరిగిందని జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు నాగరాజ్ ముదిరాజ్, మల్లప్పపటేల్ తెలిపారు. ఈ శిబిరంలో కంటి వైద్య నిపుణులు హరికిషన్ 62 మందిని పరీక్షించి 26 మందికి బోధన్ కంటి ఆసుపత్రిలో ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయించడం జరుగుతుందన్నారు.