బైక్ నడిపే వారికి హెల్మెట్ ఆరోగ్యరక్ష అని మరవద్దని బిచ్కుంద ఎస్ఐ. మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం జాతీయ రహదారిపై ఎస్ఐ. వాహనాల తనిఖీ నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. ఒరిజినల్ ఆర్ సి, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ తప్పక ఉంచుకోవాలన్నారు. ఈ తనిఖీల్లో కానిస్టేబుల్ పాండు, శేషు, హోంగార్డ్ పాల్గొన్నారు.