నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశ కార్యకర్తలకు డాక్టర్ రోహిత్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి రోహిత్ కుమార్ మాట్లాడుతూ. ప్రతి ఆశ కార్యకర్త గ్రామస్థాయిలో బీపీ, షుగర్ వ్యాది గ్రస్తుల వివరాలు సేకరించి మందులు అందజేయాలన్నారు. అలాగే గర్భిణీ వివరాలు సేకరించి నమోదు చేయాలని కోరారు.