కామారెడ్డి జిల్లా పిట్లం మండలం రాంపూర్ (కలన్) గ్రామానికి చెందిన గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సాకలి శంకర్ బుధవారం అకస్మాత్తుగా హఠాత్ మరణం చెందారు. గురువారం గ్రామంలో గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని అంత్యక్రియలలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పాల్గొని పాడే మోశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం అంత్యక్రియలు అయ్యే వరకు అక్కడే ఉన్నారు.