బాన్సువాడ మండలంలోని తాడుకోలు గ్రామ చెరువులో రాష్ట్ర ప్రభుత్వం 100% సబ్సిడీతో అందజేసిన చేప విత్తనాలను శనివారం కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ చెరువులో వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్షమన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ గంగుల గంగారం, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు కాలేక్, వైస్ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, ఎంపీడీవో బసిరుద్దీన్, నాయకులు పాల్గొన్నారు.