కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. పట్టణంలోని పలు వార్డుల్లో గుంపులు గుంపులుగా వీధి కుక్కలు సంచరించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బయటకు వెళ్లాలంటే చిన్నారులు, మహిళలు జంకే పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి వీధి కుక్కల సమస్యను పరిష్కరించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.