కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం కాంగ్రెస్ పార్టీ టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాదయాత్ర అనంతరం నిర్వహించిన కార్నర్ మీటింగ్లో పాల్గొన్న టిపిసిసి ఉపాధ్యక్షులు మదన్ మోహన్ ఆధ్వర్యంలో తన ప్రసంగాన్ని విన్నవించారు.
కామారెడ్డి జిల్లా నియోజకవర్గంలో పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి టీపీసీసీ ఉపాధ్యక్షుడు మదన్ మోహన్ రావు అని గుర్తు చేస్తూ పార్టీ కార్యకర్తల వెన్ను వెంటనే ఉంటారు అని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేదవానికి ఇచ్చిందని, ఇప్పుడు టిఆర్ఎస్ మరియు బిఆర్ఎస్ పరిపాలనలో ప్రతి పేదవానికి అన్యాయం జరిగిందని, కేసిఆర్ కుటుంబ పాలన రాచరిక పాలన పోవాలి అని, ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ హయం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పేదవాడిని ఆదుకుంటామని తెలియజేశారు.