బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని మోస్రా మండలంలోని ఒక రైస్ మిల్ లో పేకాట ఆడుతున్నారనే విశ్వనియ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సీఐ అంజయ్య , సీసీఎస్ బృందం సిబ్బందితో కలిసి పోలీసులు పేకాట స్థావరంపై మెరుపు దాడి చేసారు. 10 మందిని పట్టుకుని, 10 సెల్ ఫోన్ లు, నగదు రూ 1, 14, 550 వేలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ అంజయ్య తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం వర్ని పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ వో కు అప్పగించినట్లు పేర్కొన్నారు.