మహిళలకు గ్యాస్ సబ్సిడీ పత్రాలు అందజేసిన మున్సిపల్ చైర్మన్

73பார்த்தது
మహిళలకు గ్యాస్ సబ్సిడీ పత్రాలు అందజేసిన మున్సిపల్ చైర్మన్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి పథకంలో భాగంగా అర్హులైన మహిళలకు గ్యాస్ సబ్సిడీ పత్రాలను శుక్రవారం బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, కమిషనర్ శ్రీహరి రాజుతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్యాస్ సబ్సిడీతో పేద మహిళలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నర్సు గొండ, వార్డు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி