మెనూ ప్రకారం భోజనం అందించాలి: సబ్ కలెక్టర్
By MOHSIN 81பார்த்ததுపాఠశాలల్లో మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలని లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అధికారులను ఆదేశించారు. బుధవారం నిజాంసాగర్‌లోని అచ్చంపేట ఆదర్శ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి నిర్వాహకులపై మండిపడ్డారు. అచ్చంపేటలో దళితబంధు లబ్ధిదారులతో మాట్లాడి తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు.