కామారెడ్డి జిల్లా కేంద్రానికి ఆదివారం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ రానున్నట్లు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు బట్టు వెంకట్ రాములు తెలిపారు. జిల్లా కేంద్రంలో నిర్వహించే ధర్మ యుద్ధ మహాసభకు ఆయన హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ మహాసభకు జిల్లాలోని ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.