మోస్రా మండలంలోని గోవూర్కు గ్రామంలో రైతన్నలు వరి కోతలు కోసి తమ దాన్యాన్ని కల్లాల వద్ద ఆరబోశారు. కురుస్తున్న అకాల వర్షాలతో వరి ధాన్యం తడుస్తుందని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన నేటికీ ధాన్యం కొనుగోలు చేయకపోవడం ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజు కల్లాల వద్ద ధాన్యానికి కాపలా కాయాల్సి వస్తుందని ప్రభుత్వం త్వరగా ధాన్యం కొనుగోలు చెయ్యాలని రైతులు కోరుతున్నారు.