కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణానికి చెందిన కానిస్టేబుల్ సురేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. 22 సివిల్ బ్యాచ్ కు చెందిన మెన్ వుమెన్ బ్యాచ్ తరపున పోలీస్ కానిస్టేబులు రూపాయలు 90000 ఆర్థిక సహాయాన్ని మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా నగదును మృతుని భార్యకు అందజేసినట్లు బ్యాచ్ సభ్యులు తెలిపారు. తోటి మిత్రుని కోల్పోవడం ఎంతో బాధగా ఉందని తమ వంతుగా సహకారాలు అందిస్తున్నామన్నారు.