గుజరాత్‌లోని సబర్కాంత జిల్లాలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కమాండర్ జీప్ ఓ లారీని వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరికొందరికి తీవ్ర గాయలయ్యాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పనికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగిందన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.