కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో NSS ఆధ్వర్యంలో విద్యార్థులకు మానసిక ఒత్తిడిపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రిన్సిపల్ గౌసుర్ రెహమాన్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు మానసిక ఒత్తిళ్లకు దూరంగా ఉండి విద్యనభ్యసించి, అవసరానికి మించి చరవాణి ఉపయోగించడం వల్ల కూడా మానసిక ఒత్తిడి వస్తుందని, ప్రశాంతమైన వాతావరణంలో విద్యనభ్యసించి పట్టుదలతో ముందుకెళ్లాలన్నారు. పోటీ పరీక్షలలో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించాలని సూచించారు.