జగిత్యాల జిల్లా విద్యుత్ డివిజనల్ ఇంజినీర్ ఏ. రాజిరెడ్డి ఆధ్వర్యంలో పెగడపల్లి మండలం బతికెపల్లి గ్రామంలో "పొలంబాట"ను బుధవారం నిర్వహించారు. రైతులు తమ పొలాల వద్ద స్టార్టర్లు, ఫ్యూజులు, స్టార్ట్ డబ్బాలు నాణ్యతగా ఉండేలా చూడాలని, లో-వోల్టేజీ సమస్య రాకుండా ప్రతి రైతు కెపాసిటర్లను తప్పకుండా అమర్చుకోవాలని అన్నారు. 1912 టోల్ ఫ్రీ నెంబరుకు విద్యుత్ సంబంధించిన సమస్యలు తెలియజేసి, పరిష్కారం పొందవచ్చని తెలిపారు.