లెబెనాన్‌లో ఓ జ‌ర్న‌లిస్ట్ ఇంట‌ర్వ్యూ ఇస్తుండగా ఇజ్రాయెల్ బాంబు దాడి.. లైవ్ వీడియో

69பார்த்தது
లెబెనాన్‌లో హిజ్బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఈ క్రమంలో ఓ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ వీడియోలో ఓ స్థానిక మీడియా సంస్థ జ‌ర్న‌లిస్ట్ త‌న ఇంటి నుంచి ఇంట‌ర్వ్యూ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తన ఇంటికి సమీపంలో ఇజ్రాయెల్ ప్రయోగించిన ఓ బాంబు పడింది. దాంతో అతను భయాందోళనకు గురై అక్కడి నుంచి గట్టిగా అరుస్తూ బయటకు పరుగులు తీశాడు. ఈ దాడి దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

தொடர்புடைய செய்தி