ఐపీఎల్ మెగా వేలంలో తెలుగు కుర్రాడికి ముంబై జట్టులో చోటు దక్కింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కుర్రాడు ఫాస్ట్ బౌలర్ పీవీ సత్యనారాయణ రాజును రూ.30 లక్షలకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. సత్యనారాయణ రాజు స్వస్థలం బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం గోగన్నమఠం. తండ్రి రమేష్ రాజు రొయ్యల వ్యాపారి. అమ్మ హౌస్ వైఫ్. ఇటీవల ఎంబీఏ పూర్తి చేసి విజయ్ హజారే ట్రోఫీలో రాణించాడు.