HYD: హైదరాబాద్‌లోని బాచుపల్లి నారాయణ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న అనూష అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. దసరా సెలవులకు ఇంటికెళ్లిన అనూషను ఆదివారం ఆమె తల్లిదండ్రులు హాస్టల్లో వదిలేసి వెళ్లారు. వారు హైదరాబాద్ దాటేలోపే అనూష స్పృహ కోల్పోయిందని కళాశాల యాజమాన్యం సమాచారం ఇచ్చింది. కాలేజీకి చేరుకున్న తల్లిదండ్రులు.. తమ కుమార్తె ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని తెలుసుకున్నారు.