TG: ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరయ్యాయి. 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణానికి పరిపాలన అనుమతులను పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంజూరు చేసింది. ఇందిరా మహిళా శక్తి భవన్లలో శిక్షణా కేంద్రం, స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల మార్కెటింగ్, ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించనున్నారు. ఒక్కో భవన నిర్మాణానికి రూ. 5 కోట్లు మంజూరు చేసింది. మొత్తం రూ.110 కోట్ల అంచనా వ్యయంతో అనుమతులు మంజూరు చేసింది.