వివాహ వేడుకలో భారత్-పాక్ మ్యాచ్ లైవ్ (వీడియో)

80பார்த்தது
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్-పాక్ జట్లు ఆదివారం తలపడుతున్నాయి. దాయాదుల పోరు అంటే రెండు దేశాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జరుగుతున్న ఓ వివాహ వేడుకలో అతిథుల కోసం భారత్-పాక్ మ్యాచ్ లైవ్‌ను ఏర్పాటు చేశారు. ఓ వైపు పెళ్లి, మరో వైపు మ్యాచ్‌ను అతిథులు ఆస్వాదిస్తున్నారు. ఇక ఈ హై వోల్టేజీ మ్యాచ్ చూసేందుకు అంతా టీవీలకు అతుక్కుపోయారు.

தொடர்புடைய செய்தி