TG: తనకు హాని ఉందని, సెక్యూరిటీతోనే వెళ్లాలన్న పోలీసుల నోటీసులకు గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్ ఇచ్చారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా తాను ప్రజల సమస్యలను తెలుసుకొనేందుకు బైక్ పైనే తిరుగుతానని స్పష్టం చేశారు. తన వైపు కానీ, తన ఫ్యామిలీ వైపు కానీ ఎవరైనా కన్నెత్తి చూస్తే వారిని అడ్డంగా నరుకుతానని హెచ్చరించారు. తనకు వెన్నుపోటు పొడిచే ఆలోచనలో పార్టీ నేతలు ఉన్నారని మరోసారి రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు.