ఆప్రికాట్ పండ్లను తింటే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆప్రికాట్‌లో ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫైబర్, కాల్షియం, ఐరన్, విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉన్నాయి. ఈ పండ్లను తినడం వల్ల మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. కంటిచూపును మెరుగుపరుస్తాయి. గుండె, క్యాన్సర్ వంటి సమస్యలను తగ్గిస్తాయి. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి దోహదపడుతాయి.