హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన 'గేమ్ ఛేంజర్' ట్రైలర్ విడుదల వేడుకలో రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "రామ్ చరణ్ ఎంతో ఎత్తుకు ఎదిగాడు. మగధీర సమయంలో చరణ్‌ను నేను హీరో అని పిలిచేవాడిని. చరణ్ గుర్రపు స్వారీ సీన్స్ అన్నింటికీ నావే హక్కులు. ఆ సన్నివేశాలు చేయాలంటే నా అనుమతి తీసుకోవాల్సిందే" అని సరదాగా పేర్కొన్నారు.