బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్‌తో పనిచేయడం వల్ల ఎన్నో ఆసక్తికర విషయాలు తెలుసుకున్నానని, నేర్చుకున్నానని అన్నారు. ఆయనతో పనిచేయడం చాలా సంతోషంగా ఉందని, ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు. వార్ 1తో పోలిస్తే రెండో భాగం చాలా భారీగా ఉంటుందని, తన సినిమా గురించి తానే ఇలా గొప్పలు చెప్పుకోవడం సరికాదని అన్నారు.