ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో నిధి అగర్వాల్ తన మీద వచ్చిన కాంట్రవర్సీపై క్లారిటీ ఇచ్చింది. తాను అందరికీ నమస్కారం అని చెప్పే బ్యాచ్ కాదని చేసిన కామెంట్స్ కాజల్‌ను ఉద్దేశించి కాదని హీరోయిన్ నిధి అగర్వాల్ స్పష్టం చేశారు. తనకు కొంచెం తెలుగు వచ్చనే ఉద్దేశంతోనే ఆ మాట చెప్పినట్లు పేర్కొన్నారు. ఇందులో ఎవరినీ లక్ష్యంగా చేసుకొని అనలేదని తెలిపారు. ప్రస్తుతం ఈ అమ్మడు హరిహర వీరమల్లు, ది రాజాసాబ్ చిత్రాల్లో నటిస్తున్నారు.