అఖిల భారత యాదవ మహాసభ, గ్రేటర్ హైదరాబాద్ కార్యవర్గ సమావేశంలో, మే 3వ తేదీ బద్దుల బాబురావు యాదవ్, నేతృత్వంలో చాలకానీ వెంకట్ యాదవ్, ఆధ్వర్యంలో శుభం కన్వెన్షన్ హాల్ నాగోల్ లో యాదవ ఆత్మగౌరవ సభను హైదరాబాద్లోని అన్ని నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మైల్కోల్ మహేందర్ యాదవ్, కార్యవర్గ సభ్యులకు, నియోజకవర్గ కన్వీనర్లకు, డివిజన్ అధ్యక్షులకు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు బద్దుల బాబు రావు యాదవ్ గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి రాజబోయిన లక్ష్మణ్ యాదవ్ గారు, న్యాయ విభాగం రాష్ట్ర అధ్యక్షులు చాలకానీ వెంకట్ యాదవ్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేందర్ యాదవ్ గారు, బాల మల్లేష్ యాదవ్ గారు, జాతీయ యువజన కోఆర్డినేటర్ గొర్ల యశ్వంత్ రాజ్ యాదవ్ గారు, రాష్ట్ర కోశాధికారి దార బోయిన శ్రీనివాస్ యాదవ్ గారు, నేషనల్ యువజన కౌన్సిల్ మెంబర్ ఏశం మనీష్ యాదవ్ గారు, గ్రేటర్ హైదరాబాద్ యువజన అధ్యక్షులు మారబోయిన విజయ్ యాదవ్ గారు, గ్రేటర్ కోశాధికారి నేతి శ్రీశైలం యాదవ్ గారు, స్వామి యాదవ్ గారు, కార్వాన్ డివిజన్ కార్పొరేటర్, నియోజకవర్గ కన్వీనర్లు, డివిజన్ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.
అనంతరం యాదవుల ఆత్మగౌరవ సభ వాల్ పోస్టర్ ఆవిష్కరించిన యాదవ నేతలు.