హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, టీటీయుసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డిలను భాగ్యలక్ష్మి మందిర్ కమిటీ సభ్యులు కుమారి శశికళ, చంద్రప్రకాశ్, సంతోశ్ గురువారం కలిశారు. ఈ సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి దేవస్థానంలో గురువారం దీపావళికి చేసే ప్రత్యేక పూజలకు హాజరు కావాలని ఆహ్వానం అందజేశారు. తప్పకుండా హాజరవుతామని డిప్యూటీ మేయర్ తెలిపారు.